ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి.

జయశంకర్ భూపాలపల్లి, మే 2; ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజల నుండి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు.ఈ రోజు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు చెల్ పూర్ గ్రామస్తులు 2009లో జెన్ కో వారు తమ భూములను తీసుకొని ఇంతవరకు డబ్బులు చెల్లించలేదని సుమారుగా 40 కుటుంబాలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారని గ్రామస్తులు అందరూ కలిసి డబ్బులు చూపించాల్సిందిగా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకున్నారు. మల్హర్ మండలం చిమన్ తండా గ్రామస్తులు తేరాల నర్సింగరావు తన భూమి వివరాలు పాస్ బుక్ లో నమోదు కాలేదని దరఖాస్తు చేస్తున్నారు. రెగొండ మండలం, రేపాక గ్రామస్తుడు చవాటి రాజు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కు సంబంధించిన దరఖాస్తు చేసుకున్నారు. మహాదేవపూర్ వాసి కేదారి సుశీల తన 20 కుంటల భూమి ప్రాజెక్టు కింద పోయిందని దాని పరిహారం ఇప్పించాలని గా దరఖాస్తు చేసుకున్నారు. మహాదేవపూర్ మండలానికి చెందిన ఎస్ సి, ఎస్టి చెందిన కొన్ని కుటుంబాల యొక్క భూములు ఆన్ లైన్ లో నమోదు కాలేదని దీనివల్ల రైతు బంధు పథకం రావడం లేదని కలెక్టర్ కు దరఖాస్తు చేసుకున్నారు. భూపాలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామస్తులు సిహెచ్ శారద తన ఆరు ఎకరాల భూమి పాస్ బుక్ నందు నమోదు చేయడం లేదని జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ భూపాలపల్లి సంఘ భవన నిర్మాణం కొరకు స్థలం కేటాయించి వలసిందిగా కలెక్టర్ కు జిల్లా తాసిల్దార్ లు కలెక్టర్ జమేదార్ బి శంకరయ్య దరఖాస్తు చేసుకున్నారు. పరశురాం పల్లి గ్రామస్తుడు ఓసి త్రీ లో భూమి కోల్పోయిన నష్ట పరిహారం ఇంకా అందలేదని సింగరేణి అధికారులు తిప్పుతున్నారని దరఖాస్తు చేసుకున్నారు, ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.