ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకో వలసిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కమిషనర్

కడప జిల్లా కడప నగర ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకో వలసినదిగా కమిషనర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారుకమిషనర్ శ్రీ జి సూర్య సాయి ప్రవీణ్ చంద్ ఐఏఎస్ గారు మార్నింగ్ విజిట్ లో భాగంగా హార్టికల్చర్ ఏ డి అనిల్ కుమార్ మరియు అసిస్టెంట్ ఇంజనీర్ నిరూపలతో కలిసి గ్రీనరీ లో భాగంగా కడప నగరాన్ని మార్చుటకు ఇర్ఫాన్ సర్కిల్ నుండి ఎయిర్పోర్ట్ వరకు డివైడర్లు నందు మొక్కలు నాటాలని అలాగే వినాయక నగర్ సర్కిల్ ని గ్రీనరీ గా మార్చాలని. సెవెన్ రోడ్స్ సర్కిల్ నందు ఉన్న ఫౌంటెన్ మరియు పోస్ట్ ఆఫీస్ వద్దనున్న వైయస్సార్ ఫౌంటెన్ పూర్ణ ప్రారంభించాలని తెలిపారు. గ్రీన్ సిటీ చాలెంజ్ లో భాగంగా కడప నగరాన్ని గ్రీనరీ సిటీగా మార్పు చెందే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఏడి హార్టికల్చర్ మరియు అసిస్టెంట్ ఇంజనీర్ ఆదేశాలు జారీ చేశారు.అనంతరం అల్మాస్ పేట సర్కిల్, కోపరేటివ్ కాలనీ, ఎన్జీవో కాలనీ, ఓల్డ్ కలెక్టరేట్ నందు శానిటేషన్ లో భాగంగా శానిటరీ సెక్రటరీలు మరియు శానిటరీ ఇన్స్పెక్టర్ వారికి కేటాయించిన పరిధి నందు ఎక్కడ కూడా చెత్త లేకుండా చూసుకోవాలని అందులో జాప్యం చేసిన ఎడల వారిపై తగు చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.కడప నగర ప్రజలతో కమిషనర్ గారు మాట్లాడుతూ శానిటేషన్ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది ఏ విధంగా పని చేయుచున్నారు తెలుసుకున్నారు.కడప నగర ప్రజలకు ఇటువంటి సమస్యలు లేకుండా చూసుకో వలసినదిగా కమిషనర్ గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా ఎవరైనా జాప్యం చేసినట్లు ఆయన దృష్టికి వచ్చినట్లయితే వారిపై తగు చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా కమిషనర్ జి .సూర్య సాయి ప్రవీణ్ చంద్ ఐఏఎస్ గారు, ఏడి హార్టికల్చర్ అనిల్ కుమార్, అసిస్టెంట్ ఇంజనీర్ నిరూప, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సెక్రటరీలు మరియు నగరపాలక సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.