ప్రకృతి వైఫరిత్యం తో భారి ఆస్తి నష్టం-వెంటనే స్పందించిన సర్పంచ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సోమారంపేట గ్రామం నిన్న అర్ధరాత్రి సమయంలో
సోమారంపేట గ్రామంలో ఒక్క సారిగా భారి ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడం వల్ల భారీగా ఆస్తి నష్టం జరిగింది, భారీగా గాలి వీయడం వల్ల చెట్లు విరిగి విధ్యుత్ స్తంభాల మీద పడి విద్యుత్ తీగలు తెగిపోవడం వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది, చెట్లు విరిగి రోడ్లమీద పడడం వల్ల పలు రోడ్లుమీద రాకపోకలు నిలిచిపోయాయి, ఐకేపీ సెంటర్ లోనీ ధాన్యం మొత్తం తడిచిపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు, ఈదురు గాలి వల్ల చెట్లువిరిగి చాలా ఇండ్లుకూలిపోయినాయి, ట్రాక్టర్లు, కార్లు ధ్వంసం కావడం జరిగింది, కోళ్ల ఫారం లోని కోళ్లు చనిపోయినాయి, మామిడి చెట్లు విరిగి మామిడికాయలు రాలడం జరిగింది గ్రామంలో భారీగా ఆస్తినష్టం జరిగింది.వెంటనే గ్రామ సర్పంచ్ కాచం శ్రీనివాస్ రెడ్డి స్పందించి రోడ్ల మీది పడిఉన్న చెట్లను తొలిగించి రాకపోకలకు ఇబ్బందితలెత్తకుండ చేస్తున్నారు..

Leave A Reply

Your email address will not be published.