పేదింటి పద్మశాలి ఆడబిడ్డకు చేయుత నందించిన కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం

కాగజ్ నగర్ పట్టణంలో సర్ సిల్క్ కాలనిలో నివాసముంటున్న సుంక విజయలక్ష్మి ఒంటరి పద్మశాలి ఆడపడుచు ఇద్దరు ఆడపిల్లలతో జీవనం కొనసాగిస్తుంది. ముక్కు నుండి మెదడుకు మద్యనాళం దెబ్బతింది. ప్రతిమ హాస్పటల్ లో చికిత్స పొందింది. చిన్న ఇద్దరు ఆడపిల్లలు కలిగి జీవనాధారము ఇబ్బందుల్లో వున్న వారికి చేయుత నందించిన కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం. కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు దాసరి వెంకటేష్ మాట్లాడుతూ పద్మశాలి బంధు మిత్రుల సహాయ సహకారాలతో ఈ రోజు వారి నివాసంలో సుంక విజయ లక్ష్మి గారికి 30,500/- (ముప్పై వేల ఐదు వందల రుపాయల) ఆర్ధిక సహాయం అందించడం జరిగిందని, సహాయ సహకారాలందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక సేవలో పద్మశాలి సేవా సంఘం ఎల్లప్పుడు ముందుంటుందని ఈ సందర్భంగా తెలియచేసారు.ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘ సభ్యులు దాసరి నాగరాణి, పొన్న స్రవంతి, వేముల వెంకటేష్, కనుకుంట్ల శ్రీలత, చిందం అశోక్, సింగం శ్రీనివాస్, బూర సుధాకర్, బండారి వెంకటేశ్వర్లు, రాపెల్లి రాజన్న, వేముల శ్రీనివాస్, తేరాల సునిత, కొంగ దివ్య, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.