పెద్దవాగు వంతెన వద్ద భాజపా నిరసన దీక్ష

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రేపు పెద్దవాగు వంతెన వద్ద భాజపా నిరసన దీక్షపెంచికల్ పేట మరియు దహెగాం మండలాల మధ్య పెద్దవాగు నదిపై18 సంవత్సరాలుగా వంతెన నిర్మాణం సాగుతూనే ఉన్నది.దీనివల్ల ఈ రెండు మండలాల ప్రజలే కాకుండా చుట్టుపక్కల మండలాల ప్రజలు కూడా తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పెద్దవాగు వంతెన నిర్మాణంలో తీవ్ర జాప్యానికి నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తేదీ.19.05.2022,గురువారం రోజున ఉదయం 8 గం. నుండి పెద్దవాగు వంతెన వద్ద నిరసన దీక్ష ఏర్పాటు చేయడం జరిగినది.కావున పెంచికల్ పేట మరియు దహేగాం మండలానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన దీక్షకు హాజరై తమ ఆకాంక్షను బలంగా చాటగలరు. ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రిపోర్టర్

 

Leave A Reply

Your email address will not be published.