పెద్దలింగాపూర్* గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి,అనంతరం గ్రామంలో వికలాంగురాలు(రుచిత)కు బ్యాటరీ సైకిల్ పంఫణీ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లొని పెద్దలింగాపుర్ గ్రామంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ZP వైస్ చైర్మన్ సిద్దం వేణు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మేన్, మానకొండూర్ నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్ పెద్దలింగాపూర్ పర్యటనలో బాగంగ రుచిత అనే వికలాంగురాలు ను చూసి వారి కుటుంబ పరిస్థితులను తెలుసుకోగ వారి తల్లితండ్రులు ఆమెను స్కూల్ కి తీసుకవెళ్లాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పగా ఆయన వెంటనే స్పందించి జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడగ నేడు రుచితకు బ్యాటరీ సైకిల్ అందజేయడం జరిగిందని అన్నారు.అలాగే రైతుల ప్రయోజన కోసమే గ్రామాలలో వరి దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని అన్నారు.
కరువు ప్రాంతాల్లో కాళేశ్వరం నీళ్ళు పారుతుంటే ప్రతిపక్ష నాయకుల కళ్ళలో కన్నీళ్లు కారుతున్నాయి అని అన్నారు.రైతును రాజుగా చూడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని,ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు,ప్రజాప్రతినిధులు పని చేయాలి అని అన్నారు.రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో ఎకరానికి 5,000/- రూపాయల చొప్పున రైతుబంధు డబ్బులు జమ చేయడం జరుగుతుందని అలాగే రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.రైతు బీమా పథకం ద్వారా రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే భీమా చెల్లించి రైతు ఏదైనా ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షల రూపాయల ఉచిత బీమా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తానికి అన్నపూర్ణ రాష్ట్రంగా మారిందని అన్నారు.
▫️ ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గొడిశెల జితెందర్ గౌడ్,సెస్ డైరెక్టర్ గుడిసె అయిలయ్య,PACS చైర్మేన్ రొండ్ల తిరుపతి రెడ్డి,MPTC కరివెద స్వప్న కర్ణాకర్ రెడ్డి,మండల RBS అధ్యక్షులు చెరుకుపెల్లి రాజిరెడ్డి,PACS డైరెక్టర్ గన్నేరపు వసంత నర్సయ్య,TRS పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు సంకటి కొంరయ్య,RBS గ్రామ శాఖ అధ్యక్షులు కేతిరెడ్డి సుధాకర్ రెడ్డి,నాయకులు గొల్ల మల్లారెడ్డి,మాతిరెడ్డి కిషన్ రెడ్డి,పసుల బాబు, పసుల వెంకటి,బొప్ప శ్రీనివాస్,ల్యాగల బాగయ్య,కొడిముంజ రవిందర్,అమ్ముల అశోక్,కౌటం రవి తది తరులు పాల్గొన్నారు..

ఇల్లంతకుంట మండల్ రిపోర్టర్ బొల్లం సాయిరెడ్డి

Leave A Reply

Your email address will not be published.