పెద్దబెల్లాల్ వరిదాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎంపీపీ

పెద్దబెల్లాల్ గ్రామ పంచాయతీ లోని గిరిజన సహకార సంఘం వరిదాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం కడెం ఎంపీపీ అలెక్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు రైతులు అక్కడి సమస్యలను విన్నవించారు. కేంద్రంలో రైతుల వడ్లకు సరిపడా గన్ని బ్యాగులు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామని, వర్షాలతో ఇప్పటికే ఇబ్బందులకు గురికగా, ఇప్పుడు గన్ని సంచుల కొరతతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ.. గన్ని సంచుల కొరత లేకుండా చూస్తానని తహసీల్దార్, జీసీసీ అధికారులతో మాట్లాడారు. లారీలు కూడా త్వరగా తెప్పించి ధాన్యాన్ని తరలించేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎంపీవో వెంకటేశ్, టీఆర్ఎస్ పార్టీ మాజీ మైనారిటీ అధ్యక్షులు ముబారక్ బిన్ మొహమ్మద్,టిఆర్ఎస్ పార్టీ Sk షాకీర్ ( బాబా వార్డ్ నెంబర్) ఎండీ హసీబ్, బాలు,తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.