పర్వతగిరి తహసీల్దార్ పై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన.. ఆర్ ఎస్ పి.

పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలో 489 సర్వే నెంబర్లు ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమించి ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న వ్యక్తిపై ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్నా పట్టించుకోని తహసీల్దార్ పై ఈరోజు వరంగల్ జిల్లా కలెక్టర్ గారికి రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ వరంగల్ జిల్లా కమిటీ ఫిర్యాదు చేయడం జరిగింది
ఈ సందర్భంగా రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి వల్లం దాస్ కుమార్ మాట్లాడుతూ అన్నారం గ్రామంలో 489 సర్వేనెంబర్ లో ఉన్న ప్రభుత్వ భూమిని ఇదే గ్రామానికి చెందిన మోట పోతుల సారంగపాణి ప్రభుత్వ పోస్టల్ శాఖలో ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇంటి నిర్మాణ పనులు చేస్తున్నసారంగం తో పర్వతగిరి తహసీల్దార్ కుమ్ముక్కై ప్రభుత్వ భూమిలో జరుగుతున్న ఇంటి నిర్మాణ పనులు ఆపకుండా నిర్లక్ష్యం చేస్తున్న పర్వతగిరి తాసిల్దార్ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేసి ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్న మోట పోతుల సారంగం పై కేసు నమోదు చేసిప్రభుత్వ భూమికి వెంటనే హద్దులు నిర్ణయించ.వలసిందిగా డిమాండ్ చేస్తున్నాం ఇట్టి విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్ కు త్వరలో ఫిర్యాదు చేస్తామని చెప్పాడు.

Leave A Reply

Your email address will not be published.