నీరు లికేజి అవుతున్న ఎలాంటి స్పందన లేని అధికారులు

?మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం

?నీరు లీకేజీ అవుతున్న పట్టించుకోని అధికారులు

గద్వాల పట్టణం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా చేపట్టిన మిషన్ భగీరథ నీరు కొన్ని రోజుల నుండి నీరు పైప్ లికేజి ఐ వృధాగాపోతుంటే అధికారులు చోధ్యం చూస్తున్నారు. ఇంటింటికి నల్ల నీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన పైప్ లైన్ నీరు అందించకముందే కొన్ని చోట్ల లీకేజీలు ఉంటే అందించేటప్పుడు ఇంకా ఎన్ని లీకేజీలు ఉంటాయో అని ప్రజలు వాపోతున్నారు. గద్వాల పట్టణ కేంద్రంలోని టౌన్ పోలీస్ ఇదమ్మ గుడి నుండి మేళా చెర్వు వెళ్లే దారిలో రోడ్డు ప్రక్కన ఉన్న పైప్ లైన్ నుంచి కొంచెం కొంచెం పైప్ లో నుంచి నీరు లేకేజి తో పాటు మిషన్ భగీరథ నీరు వృధాగా పోతున్నాయి.. సంబంధిత అధికారులు మాత్రం అక్కడికి సరియైన సమయంలో చేరుకోలేదని చెప్పవచ్చు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేద్దామంటే కనీసం కనిపించడం లేదకనుక అటుగా వెళ్లే వాహన దారులు మరియూ వ్యాపారస్తులు సోషల్ మీడియా దృష్టికి తీసుకుని రావడం జరిగింది కావున మిషన్ భగీరథ అధికారులు మరియూ మున్సిపాలిటి కమిషనర్ జానకి రాం సాగర్ గారు స్పందించి నీళ్లు పైప్ లోనుంచి నీళ్లు లికేజి కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుకుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.