నిరుపేద ముస్లిం మైనార్టీ సోదరుల కు దుస్తుల పంపిణీ

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని నిరుపేద ముస్లిం మైనార్టీ సోదరులు మహమ్మద్ చాంద్ పాషా, మహమ్మద్ యూసుఫ్, మహమ్మద్ వాహిద్ లకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా దళిత రత్న అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ (ప్రభు) ఆదివారం రోజున తన కార్యాలయంలో దుస్తుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం మాదిరిగానే రంజాన్ పండుగకు నిరుపేదలైన ముస్లిం మైనార్టీలకు బియ్యం దుస్తువులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించిన పే బ్యాక్ సొసైటీ లో భాగంగానే సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు అంబాల రాజు గంగారపు మహేష్ శనిగరపు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.. ప్రజా నేత్ర ప్రతినిధి దొడ్డే రాజేంద్ర ప్రసాద్

Leave A Reply

Your email address will not be published.