నిరుపేదల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదు – సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి

ప్రజానేత్ర న్యూస్,ఆదిలాబాద్, తేదీ:05-05-2022 ; ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 46 వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ అదిలాబాద్ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన నిరుపేదల సమస్యలను పరిష్కరించేంత వరకు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలోలో చేపట్టే పోరాటాలు ఆపేది లేదన్నారు. గత కొన్ని నెలల నుండి నిరుపేద ప్రజలందరూ డబుల్ బెడ్ రూమ్ లో మంజూరు చేయాలని, అర్హులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని, నిరుపేదలు ఆపకుండా స్థలాలకు పట్టాలు ఇవ్వాలని, సొంత ఇంటి స్థలం ఉన్న వారికి ఇల్లు నిర్మాణం కొరకు ఐదు లక్షలు వెంటనే ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో వివిధ రూపాలలో కార్యక్రమాలు నిర్వహించి, పలుమార్లు కలెక్టర్ కార్యాలయం ముట్టడించి అధికారులను కలిసి విన్నవించినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో గత 45 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడమే సిగ్గుచేటన్నారు. ఇకనైనా స్పందించి అర్హులైన నిరుపేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రిలే నిరాహార దీక్షలకు ఈ రోజు ప్రముఖ న్యాయవాది సిపిఐ సీనియర్ నాయకులు రహీం గారు మద్దతు తెలిపారు. నిరాహార దీక్షలను రేష్మ, ఆశ, శోభ, సుజాత, జ్యోతి, సుల్తాన భి, నస్రీన్ బి, అరుణ, పర్వీన్, సీమ లు దీక్షలో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు భాస్కర్, కేశవ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.