నారాయణ శెట్టి ఆధ్వర్యంలో వైభవంగా వాసవి కన్యాకపరమేశ్వరి జయంతి వేడుకలు

మంత్రాలయం మండల కేంద్రంలో ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవి కన్యాకపరమేశ్వరి జయంతి వేడుకలను సంఘం అధ్యక్షులు నారాయణ శెట్టి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి చిత్రపటాని గ్రామంలో పురవీధుల గుండా ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ఉరేగించారు. అనంతరం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో గౌతమ్ స్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. వాసవి జయంతి సందర్భంగా పెద్దాయన గౌరవనీయులు ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వై. సీతారామిరెడ్డి అన్న గారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం పెద్దాయనకు శాలువ కప్పి, తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వాదించారు. ఈయనతో పాటు మంత్రాలయం సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, ఉప సర్పంచ్ హోటల్ పరమేష్, ఎంపిటిసి సభ్యులు వెంకటేష్ శెట్టి, నాయకులు జనార్దన్ రెడ్డి, కృష్ణ స్వామి, బద్రినాథ్ శెట్టి, దామోదర్ శెట్టి, ప్రహ్లాదయ్య శెట్టి, ఫణీరాజ్, కందుకూరు బసవరాజు తదితరులు ఉన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం ప్రజా నేత్ర రిపోర్టర్ నర్సింహులు

Leave A Reply

Your email address will not be published.