దళితబంధు మంజూరు యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

జయశంకర్ భూపాలపల్లి, మే 19: జిల్లాలో ఇప్పటివరకు మంజూరు దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ వారం రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో అధికారులతో దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళితబంధు పథకం క్రింద జిల్లాకు 151 యూనిట్లు మంజూరయినట్లు తెలిపారు. మంథని నియోజకవర్గ పరిధిలో 60 యూనిట్లకు గాను, 31 రవాణా కు సంబంధించి, 29 రవాణయేతర యూనిట్లు, భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో 90 యూనిట్లకు గాను, 56 రవాణా, 34 రవాణాయేతర యూనిట్లు, ములుగు నియోజకవర్గ పరిధిలో ఒక రవాణా యూనిట్లు ఉన్నట్లు ఆయన అన్నారు. రవాణా యూనిట్లకు సంబంధించి మంజూరు ప్రక్రియ పూర్తిచేసినట్లు ఆయన తెలిపారు. రవాణాయేతర యూనిట్లకు సంబంధించి, ఆయా యూనిట్ల సేకరణకు వరంగల్, హైదరాబాద్ మార్కెట్ నుండి కొటేషన్లు, సంప్రదింపులు జరిపి, యూనిట్ల సేకరణ ప్రక్రియ వారం లోగా పూర్తి చేయాలన్నారు. యూనిట్ల ధర, నాణ్యత విషయంలో నిబంధనలు పాటించాలని, ప్రత్యేక అధికారులు, నోడల్ అధికారులు, ఇడి ఎస్సి కార్పొరేషన్ సంయుక్తంగా మంజూరుకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమని, ఏ దశలోనూ నిర్లక్ష్యం వలదని, వంద శాతం లక్ష్యం పూర్తి చేసి, పథకాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్ష లో ఇడి ఎస్సి కార్పొరేషన్ వెంకటేశ్వర్లు, డిఆర్డీవో డి. పురుషోత్తం, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డా. వి. సదానందం, జిల్లా వ్యవసాయ అధికారి ఎం. విజయభాస్కర్, పరిశ్రమల శాఖ జియం జి. శ్రీనివాస్, జిల్లా ఉద్యానవన అధికారి ఎంఏ. అక్బర్, ఎల్డిఎం ఎన్. శ్రీనివాసరావు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ ఎస్. రాఘవేందర్, ఎంవిఐ సంధాని మహమ్మద్, ఐటిడిఎ డిఇ ఎన్. సంపత్ కుమార్, జెడ్పి డిప్యూటీ సిఇఓ ఎం. రఘువరన్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.