తీరిన తాగునీటి కష్టాలు
నిర్మల్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి డా: పడకండి రమాదేవి గారి పిలుపుమేరకు, కడెం మండల్ అధ్యక్షుడు శ్రీ ధర్మాజీ కిష్టయ్య గారు, కోశాధికారి ధర్మపురి తిరుమలయ్య గారు ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గౌరవ శ్రీ సోయం బాబూరావు గారిని తాగునీటి సమస్య గురించి విన్నవించగా కడెం మండలంలోని అల్లంపల్లి: గ్రామపంచాయతీ “చింత గూడ” గ్రామంలో మరియు బాబా నాయక్ తండా:గ్రామపంచాయతీ “గంగిపల్లి గూడెం”లో రెండు బోరు బావులు అండ్ మోటార్ లు ఎంపీ నిధుల నుండి మంజూరు చేయడం జరిగింది. కావున ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కడెం మండలానికి మరిన్ని ఎక్కువగా నిధులు కేటాయించి మా ప్రజల సమస్యలను తీర్చగలరని కోరుచున్నాము. ఇట్లు కడెం మండల్ భాజపా అధ్యక్షుడు ధర్మాజీ కిష్టయ్య