కోడూరు లో సమస్యలు పరిష్కరించాలని  నూతన కలెక్టర్ కి  సిఐటియు వినతి పత్రం!

అన్నమయ్య జిల్లా నూతన జిల్లా కలెక్టర్ గిరీష్ గారు, రైల్వేకోడూరు కి మొదటిసారిగా హాజరైన సందర్భంగా, సి ఐ టి యు,  వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, కోడూరు సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది.  కలెక్టర్ గారి తో, సిఐటియు జిల్లా కార్యదర్శి  సిహెచ్ .చంద్రశేఖర్ మాట్లాడుతూ ,గత ఆరు నెలల క్రితం గుంజన నది, వరదల్లో 27  ఇండ్లు కొట్టకపోతే నేటికీ నష్టపరిహారం అందలేదన్నారు, తక్షణమే బాధితులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు, అన్నమయ్య ప్రాజెక్టు, వరద బాధితులకు రెండు నెలల్లో,  ఇల్లుకట్టిస్తామని,  ముఖ్యమంత్రి హామీ ఆరునెలలు అయినా గుడారాలకు పరిమితమైందని ఆందోళన వ్యక్తం చేశారు. నిధులు లేవని వస్తానే   అందిస్తామని హామీ ఇచ్చారు, ఈ మధ్యకాలంలో వర్షాలకు, పెనుగాలులకు పంటలు దెబ్బతిన్నాయని, రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు.  కోడూరు పట్టణానికి ప్రొటెక్షన్ వాళ్ళు ఏర్పాటు చేయాలని వినతి పత్రం లో కోరడమైనది, ప్రభుత్వానికి రిపోర్ట్ పంపి  ఉన్నామని, తెలిపారు. గత ఎనిమిది సంవత్సరాలుగా అసైన్మెంట్ కమిటీ సమావేశం జరగలేదని పేదలకు ఒక ఎకరా భూమి పరచలేదని రెవెన్యూ అధికారులు మామూలు తీసుకొని అసైన్మెంట్ తో సంబంధం లేకుండా  బోగస్ ఆన్లైన్లో చేస్తున్నారని,  కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.  ఇద్దరు ఎంఆర్ఓ ను తొలగించడం హర్షణీయమన్నారు. ఐదు మండలాల్లో బోగస్ ఆన్లైన్ లపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తక్షణం అసైన్మెంట్ కమిటీ  సమావేశం ఏర్పాటు చేసి పేదలకు భూములు పంపిణీ చేయాలని వినతిపత్రంలో కోరారు. అదేవిధంగా జిల్లా కేంద్రం రాయచోటికి కోడూరు నుండి ఒక్క బస్సు కూడా లేదని,  తక్షణం ఆర్టిసి  సర్వీసులు నడపాలని  కోరారు, తిరుపతి నుండి కూడా కోడూరు. మీదుగా సర్వీసులు నడపాలని కోరారు. వారం రోజుల్లో సర్వీస్ నడుపుతామని హామీ ఇచ్చారు. వెంకటగిరి రోడ్డు పూర్తి చేసి ప్రారంభించాలని కోరారు. కోడూరు లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని, రైల్వే అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని,  తదితర డిమాండ్లను, వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోడూరు శాసనసభ్యులు, కొరముట్ల శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్,  రాజంపేట,  ఆర్డిఓ, ఎమ్మార్వో  రామ్మోహన్, సిఐటియు  ఉపాధ్యక్షులు లింగాల యానాదయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, సిగి చెన్నయ్య, బొజ్జ శివయ్య, ఆవాస్ మండల కన్వీనర్,  పి మౌలాలి భాష, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి  పి.జాన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.