కాగజ్ నగర్ మార్కెట్ కమిటీ నుండి అక్రమంగా నిధుల మళ్ళింపు పట్ల ఆందోళన వ్యక్తం చేసిన భాజపా నాయకులు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం Iకాగజ్ నగర్ పట్టణంలో మార్కెట్ కమిటీ నుండి దాదాపు రూ.2 కోట్ల సెస్సు నిధులు సిద్దిపేట మార్కెట్ కమిటీకి మళ్లించి అక్కడ అభివృద్ధి పనులు చేయడం జరిగిందని నిన్న ఆంధ్రజ్యోతి పత్రిక ప్రధాన సంచికలో “సొమ్మేమో కాగజ్ నగర్ ది, సోకేమో సిద్దిపేటకా” అనే శీర్షికన కథనం రావడం జరిగింది. భాజపా నాయకులు ఈ రోజు ఉదయం కాగజ్ నగర్ పట్టణం లోని బీట్ మార్కెట్ వద్దకు చేరుకుని ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది.పట్టణ అధ్యక్షులు గోలెం వెంకటేశం మాట్లాడుతూ వెనకబడిన ప్రాంతానికి చెందిన నిధులను అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఖర్చు పెట్టడం చాలా దారుణమని తెలిపారు.భాజపా నాయకులు డా. పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ కాగజ్ నగర్ మార్కెట్ కమిటీ నుండి అక్రమంగా నిధుల మళ్లింపు చూస్తే “బిచ్చగాని దగ్గర బిచ్చం అడిగినట్టు” గా ఉన్నదని తెలియజేశారు. రూ.2 కోట్ల నిధులు సిద్దిపేట మార్కెట్ కమిటీ కి తరలించి అక్కడ అభివృద్ధి పనులు చేపట్టి కాగజ్ నగర్ డివిజన్ లోని రైతుల నుండి వసూలు చేసిన సెస్సు నిధులను అభివృద్ధి చెందిన సిద్దిపేటకు మళ్లించి అప్పటి మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు మనకు తీరని అన్యాయం చేశారని తెలిపారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మౌనంగా ఉండడం మన ప్రాంత రైతులను మోసం చేయడమేనని తెలియజేశారు. అనంతరం ర్యాలీ గా బయలుదేరి మార్కెట్ కమిటీ అధికారులకు వినతి పత్రం ఇచ్చి మన మార్కెట్ కమిటీ నిధులను వడ్డీతో సహా తిరిగి రాబట్టి మన ప్రాంత రైతాంగం కోసం ఖర్చు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలియజేశారు.ఈ వినతిపత్రం కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఈశ్వర్ దాస్, సర్పంచ్ దోతుల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శులు గజ్జి ప్రసాద్, ఉమ్మెర బాలకృష్ణ, మాజీ కౌన్సిలర్ దెబ్బటి శ్రీనివాస్, పుల్ల అశోక్, మాచర్ల శ్రీనివాస్, చీరాల శ్రీనివాస్, చిప్పకూర్తి రమేష్, అశోక్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్, బొర్లకుంట పోచయ్య, రాజేందర్ జాంజొడ్, గోవింద్ మండల్, పాగిడి రాకేష్, భీమన్ కార్ బాబురావు, గణపతి, కౌశిక్, పెరుగు శ్రీను, పూదరి శ్రావణ్, నగోసే హన్మంతు, సుమన్ కుందారపు, గుండా రాజు, గడ్డం తిరుపతి,, దుర్గం సంఘదీప్, రవి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.