ఎమ్మెల్యే రేఖకు చుక్కెదురు రాథోడ్ కు ఉపశమనం..

న్యాయమే గెలిచింది  ఎమ్మెల్యే రేఖకు చుక్కెదురు రాథోడ్ కు ఉపశమనం.. అధికార బలంతో పోలీసులపై ఒత్తిడి చేసి తప్పుడు కేసులు నమోదు చేయించిన, న్యాయ వ్యవస్థలపై నమ్మకం ఉండబట్టే న్యాయ స్థానములో అన్యాయం అంతమౌతుంది. 2015 సంవత్సరంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా మాజీ ఎంపీ సీనియర్ నాయకుడు రమేష్ రాథోడ్ పై అప్పట్లో తప్పుడు కేసు నమోదు చేయించారు. ఇరువురి వాదనలు విన్న ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు ఆ కేసును కొట్టివేసింది. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని, న్యాయ వ్యవస్థ పై తమకు పూర్తి నమ్మకం ఉందని మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ అన్నారు.కొర్టు తీర్పును గౌరవిస్తామని ఆయన తెలిపారు.కాగా కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. 2015 సంవత్సరంలో ఖానాపూర్ పోలీసు స్టేషన్ లో ఎమ్మెల్యే రేఖా గన్ మెన్ కొప్పుల శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.కాగా ఐపిసి353,ఐపిసి 323 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే తో పాటు 15 మంది సాక్షులను విచారించిన నాంపల్లి ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం ఆ కేసును కొట్టివేస్తూ , తీర్పు వెలువరించింది.
దింతో రమేష్ రాథోడ్ అభిమానులు, బిజెపి పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.