ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లకు కనీస వేతనం ఇరవై ఒక్క వేలు ఇవ్వాలని ,  సి ఐ టి యు డిమాండ్

ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లకు కనీస వేతనం 21000 ఇవ్వాలని, సి ఐ టి యు కడప జిల్లా కార్యదర్శి సిహెచ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. బుధవారం అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు ఫీల్డ్ అసిస్టెంట్ లతో మాట్లాడుతూ,  అనేక,సంవత్సరాలుగా ఫీల్డ్ అసిస్టెంట్లు తక్కువ వేతనాలతో పని చేస్తున్నారని, ఉద్యోగ భద్రత లేదని, ఆరోపించారు.  సిపిఎం వామపక్షాలు మద్దతుతో ఉపాధి హామీ చట్టం ఏర్పడదని. నేడు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, బడ్జెట్లో నిధులు కోత విధించి, నిర్వీర్యం చేయాలని కుట్రపన్నారు. వేసవి కాలంలో ఇచ్చే 30 శాతం అలవెన్స్ రద్దు చేశారని, 245 రూపాయలు సీలింగ్ పెట్టారని, దీంతో కూలీలు  కూలికి  దూరం అవుతున్నారని, ఉపాధి హామీ పథకాన్ని  రద్దు చేసేందుకు కుట్ర జరుగుతోందని, కార్మికులు, కూలీలు ఐక్యమై తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కూలీల కు కూలీ సక్రమంగా చెల్లించడం లేదని, రెండు నెలలు జరుగుతూ ఉన్నా  కూలి ఇవ్వలేదన్నారు,  ఈనెల 16న వ్యవసాయ కార్మిక సంఘం కడప కలెక్టర్ ఆఫీస్ వద్ద జరుగుతున్న ఆందోళనకు సి ఐ టి యు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. రెండు పూటలా పని రద్దు చేయాలని బకాయి పడ్డ వేతనాలకు వడ్డీతో సహా ఇవ్వాలని రోజుకు 600 కూలీ ఇవ్వాలని, 200 రోజులు పని కల్పించాలని పని కోసం దరఖాస్తు చేసుకున్న కూలీలకు, పని కల్పించకపోతే, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పనులు చేపట్టాలని కోరారు.  ఈ కార్యక్రమంలో రైల్వే కోడూర్ ఫీల్డ్ అసిస్టెంట్ లో సంఘం సి ఐ టి యు, అధ్యక్షులు ముని చంద్ర రాజు, ప్రధాన కార్యదర్శి నారాయణ,శివయ్య, ప్రసాదు నాగేశ్వరరావు, వెంకటరాయలు, తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.