ఈతకు వెళ్లి బాలుడు గల్లంతు

ఆస్పరి మండలం పరిధిలోని జోహార పురం గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. తండ్రి కురువ వీరేశ్ టైలరింగ్ చేస్తూ జీవనం సాగించేవాడు ఆయనకు ఇద్దరు కుమారులు తండ్రి కొడుకులు కలిసి ఊరు బావిలో స్నానం చేయుటకు వెళ్లారు. స్నానం చేసి తిరిగి వస్తుండగా వీరేశ్ ఈ చిన్న కుమారుడు విష్ణువర్ధన్ మరొక్కసారి బావిలోకి దూకి వస్తానని వెళ్లగా బావి లోకి దూకిన విష్ణు తిరిగి రాకపోవడంతో తండ్రికి అనుమానం వచ్చి చూడ బాలుడు కనిపించకపోవడంతో స్థానికుల గజ ఈతగాళ్ళు సహాయంతో బావిలోకి దూకి విష్ణు ఆచూకీ గాలింపు చర్యలను చేపట్టారు. బావిలో నీరు ఎక్కువగా ఉండడంతో 4 ట్రాక్టర్ మోటర్ ల సహాయంతో మధ్యాహ్నం 1:30 నిమిషాల నుండి ఉదయం 8 గంటల వరకు బావిలో నీరు బయటికి ఎత్తి వేయగా బాలుడు మృతదేహం బయటికి వెలికి తీయడం జరిగింది. ఇందులో భాగంగా పత్తికొండ ఫైర్ సిబ్బంది, ఆస్పరి పోలీస్ సిబ్బంది, తదనంతరం పోస్టుమార్టం నిమిత్తం కొరకు ఆదోని గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకు వెళ్లడం జరిగింది.

ప్రజా నేత్ర రిపోర్టర్ శేఖర్ ఆస్పరి

Leave A Reply

Your email address will not be published.