అన్నమయ్య  ఉయ్యాల మృతుడికి 20 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి! బాధిత కుటుంబాలకు రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలి! సిపిఎం డిమాండ్!

రాజంపేట అన్నమయ్య ఉత్సవాల సందర్భంగా, రాజంపేట అన్నమయ్య విగ్రహం వద్ద, సోమవారం, 20 అడుగుల  ఎత్తులో ఉన్న ఉయ్యాల  ముగ్గురు కూలీల మీద పడి,బోయినపల్లి అరుంధతి  వాడకు చెందిన కత్తి ఎల్లయ్య మృతి చెందారని, రామయ్య చంటయ్య, మరో ఇద్దరు కూలీలకు తీవ్ర  గాయాలయ్యాయని, టిటిడి అధికారులు, ఘటన వెలుగులోకి రాకుండా తొక్కి పెట్టారని, సిపిఎం  జిల్లా పార్టీ నాయకులు
సిహెచ్. చంద్రశేఖర్, సిగి చెన్నయ్య, కెవిపిఎస్ డివిజన్ కన్వీనర్  ఓ బి లి పెంచలయ్య, విలేకరుల సమావేశంలో ప్రకటించారు. టీటీడీ అధికారులు నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా, టెక్నికల్ పర్సన పర్యవేక్షణ లేకుండా, అనుభవం లేని కూలీలు చేత, పని చేయించడం ఫలితంగానే ఈ ఘటన జరిగిందన్నారు. దీనికి పూర్తి బాధ్యత టిటిడి అధికారులదే అన్నారు తక్షణం మృతి చెందిన కత్తి ఎల్లయ్య కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, వారి కుటుంబంలో ఒకరికి రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గాయపడిన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, వారికి కూడా 5 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలనే డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.