అధిక  ధరలను అరికట్టాలని 30 న కలెక్టరేట్ వద్ద  ధర్నా జయప్రదం చేయండి! సిపిఎం నేతల పిలుపు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్,  డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని, వంట నూనెలు, నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలని, విద్యుత్తు చార్జీలు, బస్ చార్జీలు, ఆస్తి పన్ను నీటి పన్ను, చెత్త పన్ను భారాలను ఉపసంహరించాలని, డిమాండ్ చేస్తూ, ఈ నెల 30న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని, సిపిఎం పార్టీ అన్నమయ్య జిల్లా నాయకులు సి హెచ్ చంద్రశేఖర్, పిలుపునిచ్చారు. శుక్రవారం అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు సిపిఎం పార్టీ ఆఫీసులో  గోడ పత్రాలను పార్టీ నాయకులు ఆవిష్కరించారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ,కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని వంద రెట్లు ధరలు పెంచిందని, నిత్యావసర వస్తువులతో సహా వంట నూనెలు ధరలు అదుపు చేయడం లేదని, కరోనా సంక్షోభంలో ఆర్థిక పరిస్థితి సరిగా లేదని, పేద మధ్యతరగతి ప్రజలు, ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అని తెలిపారు. వామపక్షాలు  ఆందోళనలకు దేశవ్యాప్తంగా పిలుపునిచ్చిన సందర్భంగా, నామ కే వాస్తే పెట్రోల్ 8, డీజిల్ 6, గ్యాస్ 200  రూపాయల తగ్గించారని తెలిపారు.  50రూపాయల  ఉన్న పెట్రోలు 120 రూపాయలుచేశారు., 35 రూపాయలు  ఉన్న డీజిల్,110 రూపాయలు చేశారు, 400 ఉన్న గ్యాస్ వెయ్యి రూపాయలు చేశారు, సబ్సిడీ ఎత్తేసారు,  దీనితో అన్ని రకాల ధరలు పెరుగుతాయని రిలయన్స్ అంబానీ ఆదానికి ప్రజల ఆస్తి దోశ పెట్టడానికే ధరల పెంచారన్నారు. మరోపక్క ఉపాధి లేక కొనుగోలు శక్తి లేక ఇబ్బంది పడుతూ ఉంటే, పుండు మీద కారం చల్లి నట్లు, వైసిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా గత  తెలుగుదేశం ప్రభుత్వం మాధురి, బాదుడే బాదుడు, విద్యుత్ ఛార్జీలు బస్ చార్జీలు ఆస్తిపన్ను నీటి పన్ను చెత్త పన్ను, అన్ని రకాల పనులు ప్రజలపై భారం  మో పారని, తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మే 30వ తేదీన కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోడ పత్రం విడుదల చేసిన వారిలో, సిపిఎం మండల నాయకులు,  లింగాల యానాదయ్య,సిగి చెన్నయ్య, దాసరి జయచంద్ర,  ఓబులవారిపల్లి మండల నాయకులు, ఎం, జయరామయ్య, చిట్వేల్ మండల నాయకులు ఓబిలి. పెంచలయ్య, పి. జాన్ ప్రసాద్, పి. మణి, కోట పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.