అంబేద్కర్ పేరును వివాదాస్పదం చేయొద్దు!

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను, వివాదాస్పదం చేయొద్దని, సి ఐ టి యు కడప జిల్లా కార్యదర్శి సి హెచ్ చంద్రశేఖర్ మంగంపేటలో,విలేకర్ల సమావేశంలో డిమాండ్ చేశారు.  కోనసీమ లో జరిగిన   విధ్వంస కాండను  తీవ్రంగా ఖండించారు.రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన సందర్భంగా అనేక జిల్లాలకు, స్వతంత్ర సమరయోధులు, ప్రముఖ రాజకీయ నాయకులు, ఆధ్యాత్మిక దేవుళ్ళు పేర్లు పెట్టారు. కోనసీమకు అంబేద్కర్ జిల్లా పేరు పెట్టడానికి  మనువాద బిజెపి తప్ప, సిపిఎం పార్టీ తో సహా అన్ని రాజకీయ పార్టీలు  అంగీకరించాయని,  తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ  రచన నిర్మాత, అందరికీ నాయకుడు అన్నారు. కోనసీమ అందరిదీ అని అంబేద్కర్ అందరివాడు అని, ఇతర జిల్లాలకు ఏ విధంగా  పేర్లను అంగీకరించారు అదేవిధంగా దీన్ని కూడా ఆమోదించాలి అన్నారు. అంబేద్కర్ పేరు పెట్టడానికి అగ్రకుల దురహంకారం ఎంత దుర్మార్గంగా  ఉందో, దీన్నిబట్టి, కుల వివక్షత అంటరానితనం రాష్ట్రంలో ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. విధ్వంసాలు సృష్టించే వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. అమలాపురంలో శాంతి సామరస్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, సిగి చెన్నయ్య,  జిల్లాకార్యదర్శి  పంది కాళ్ళ మణి, సి ఐ టి యు ఓబులవారిపల్లె మండల కన్వీనర్, దార్ల సుధాకర్,  సి ఐ టి యు పుల్లంపేట మండల కన్వీనర్, దార్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.