136వ మేడే దినోత్సవం  జయప్రదం చేయాలి సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్.చంద్రశేఖర్

దేశాన్ని కాపాడండి– ప్రజలను రక్షించండి!! నినాదంతో, మే డే ను జయప్రదం చేయాలి!!
సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్.చంద్రశేఖర్ పిలుపు!!!

ప్రపంచ కార్మిక దినోత్సవం  136వ మేడే దినోత్సవం  జయప్రదం చేయాలని, అన్నమయ్య జిల్లా, రైల్వేకోడూరులో, సి ఐ టి యు మండల నాయకులు, కనపర్తి కిరణ్ కుమార్, అధ్యక్షతన జరిగిన, ముఖ్యుల సమావేశంలో,  పాల్గొన్న  సి ఐ టి యు కడప జిల్లా కార్యదర్శి  సిహెచ్ చంద్రశేఖర్, మాట్లాడుతూ, ఎనిమిది గంటల పని,  కాపాడుకోవాలని,  దేశాన్ని కాపాడాలని, ప్రజలను రక్షించాలని, నినాదంతో, మేడే ఉత్సవాలను జయప్రదం చేయాలని, ఉద్యోగులు కార్మికులు, కర్షకులకు, పిలుపునిచ్చారు. అమెరికా  చికాగో నగరంలో కార్మికుల మృత వీరుల త్యాగాల ఫలితం 1886లో పోరాట ఫలితంగా ఎనిమిది గంటల పని సాధించడం జరిగింది అన్నారు. నేడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, దేశంలో పోరాడి సాధించుకున్న  44 కార్మిక చట్టాలను, నాలుగు కోడులు గా, పెట్టుబడిదారులకు అనుకూలంగా  మార్చి వేశారు అన్నారు. పన్నెండు గంటలకి పనిగంటలు పెంచడం   చేశారన్నారు.  దీన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు, ప్రభుత్వ సంస్థలను, ప్రజల ఆస్తులను, కేంద్రంలో బిజెపి, కారుచౌకగా , అమ్మేస్తున్న ని, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని, ఆరోపించారు.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు,  విపరీతంగా, నిత్యవసర వస్తువులు ధరలు, పెంచడం , విపరీతంగా పన్నులు వేయడం, పేద మధ్య తరగతి ప్రజలు, పైన భారాలు వేస్తున్నారన్నారు.ఏడాది పాటు జరిపిన రైతు ఉద్యమం  స్ఫూర్తిదాయకం అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, పోరాడాలని,   మతతత్వానికి   వ్యతిరేకంగా, లౌకికతత్వం  కోసం కృషి చేయాలని  కోరారు, సోషలిస్టు సమాజం  లోనే కార్మికులు, కర్షకులకు, రక్షణ  ఉంటుందన్నారు.  ఈ కార్యక్రమంలో  సి ఐ టి యు సీనియర్ కార్మిక నాయకులు  మోడీ సుబ్బరామయ్య,  సి ఐ టి యు ఉపాధ్యక్షులు, లింగాల యానాదయ్య, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్,  ప్రాజెక్టు అధ్యక్షురాలు, ఎన్. రమాదేవి, డి. సుజాత, మాధవి, యునైటెడ్  ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, నాయకులు, రాజు, వీఆర్ఏ సంఘం అధ్యక్షులు, కే. కుమార్, ఏపీఎండీసీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్, అధ్యక్షులు  కుప్పాల సుబ్రమణ్యం, మంగంపేట మైనింగ్ వర్కర్స్ యూనియన్, త్రివేణి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు,  పల్లగంటి. శ్రీనివాసులు, ఎం శ్రీనివాసులు, శివ, అవాజ్ మండల కన్వీనర్, పి. మౌలాలి భాష, ఎస్ ఎఫ్ ఐ, జిల్లా సహాయ కార్యదర్శి, పి జాన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.