వరంగల్ లో నిర్వహించే రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభను విజయవంతం చేయండి: జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పిన్నింటి అనిల్ రావు

పర్వతగిరి మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పిన్నింటి అనిల్ రావు, మండల పార్టీ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్ తో కలిసి విలేకరులతో మాట్లాడుతూ మే 6వ తేది న వరంగల్ నిర్వహించే రైతు సంఘర్షణ సభపై 29 శుక్రవారం రోజు పర్వతగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పర్వతగిరి మండల ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుంది. వరంగల్ లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయడంలో పర్వతగిరి మండలంలోని ప్రతి బూతు నుండి 50 నుండి వంద మందికి తగ్గకుండా స్వచ్ఛందంగా తరలి వెళ్లి సభను విజయవంతం చేయడంలో పర్వతగిరి మండల నాయకులు ముందుండాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కందికట్ల అనిల్, యూత్ కాంగ్రెస్ వర్ధన్నపేట నియోజకవర్గ అధ్యక్షులు కొమ్ము రమేష్, పర్వతగిరి పట్టణ అధ్యక్షులు కుసం రామచందర్, నరెడ్ల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.