ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు సి పి యస్ విధానాన్ని రద్దు చేయాలి -యుటిఎఫ్

ప్యాపిలి ఏప్రిల్ 20 (ప్రజా నేత్ర న్యూస్) :ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారంగా కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) ఆధ్వర్యాన పోరుగర్జన పేరుతో ఏప్రిల్ 18 నుండి 25 వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు యుటిఎఫ్ ప్యాపిలి మండల శాఖ సహాధ్యక్షులు హుసేన్ బాషా పేర్కొన్నారు.పాఠశాల సమయం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సి పి యస్ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాలు అయినప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదని పైగా కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.పి ఆర్ సి చర్చల సందర్భంగా మార్చి 31 లోపు సి పి యస్ రద్దు కోసం రోడ్ మ్యాప్ ప్రకటిస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం ఏప్రిల్ 3,ఏప్రిల్ 7 చర్చలు అని చెప్పి ఆ చర్చలను కూడా వాయిదా వేసి కనీసం చర్చలు జరిపే తేదీ కూడా ప్రకటించక పోవడం 2 లక్షల మంది ఉద్యోగ,ఉపాధ్యాయులను మోసం చేయడమే అని అన్నారు. యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 18 నుండి శ్రీకాకుళం,విజయనగరం,చిత్తూరు,అనంతపురం జిల్లాల నుండి నాలుగు జాతాలు ప్రారంభం అయ్యాయని అనంతపురం నుండి వచ్చే జాతా ఈ నెల 22 వ తేదీన కర్నూల్ జిల్లాలో ప్రవేశించడం జరుగుతున్నదని కావున జాతా ప్యాపిలి మండలానికి వచ్చే రోజు ఎక్కువ సంఖ్యలో ఉపాధ్యాయులుకార్యకర్తలు హాజరై బైక్ ర్యాలీ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మధు,షబానా ఆజ్మీ, మాబాషా, గోపాల్,పురంధర్ పాల్గొన్నారు. ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.