మంత్రి పర్యటనకు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్ర

జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 19: జిల్లాలో ఈ నెల 21 న పర్యటించనున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మంగళవారం పరిశీలించారు. సింగరేణి 1000 క్వార్టర్స్ సమీపంలో 22 ఎకరాల స్థలంలో నిర్మించనున్న జిల్లా ఆసుపత్రి, వైద్య కళాశాల, 50 పడకల ఆయుష్ ఆసుపత్రి భవన నిర్మాణాలకు మంత్రి శంఖుస్థాపన చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. శిలా ఫలకాల ఏర్పాటు, పర్యటన సందర్భంలో వాహనాల పార్కింగ్, విఐపిల వాహనాల చలనం విషయమై అధికారులకు సూచనలు ఇచ్చారు. ఎండలు తీవ్రంగా వున్నందున, నీడకు, త్రాగునీటికి ఏర్పాట్లు చేయాలన్నారు. పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతం అయ్యేలా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర టిఎస్, టిఎస్ఏంఎస్ఐడిసి ఎస్ఇ దేవేందర్ కుమార్, డిఇ నాగిరెడ్డి, ఏఇ నితిన్, అధికారులు తదితరులు వున్నారు.

Leave A Reply

Your email address will not be published.