భూమాత పరిరక్షణ అందరి బాధ్యత ధరిత్రి దినోత్సవ ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు

అనంత జీవకోటికి జీవనాధారమైన భూమాతను పరిరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయ కర్త అశ్విని చంద్రశేఖర్ అన్నారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేశారు. సకల జీవ రాశులకు ,మానవాళికి అవాసమైన భూమాత పట్ల గౌరవవాన్ని,బాధ్యత ను కలిగి ఉంటానని ,ప్రకృతి దైవంగా భావించి గాలి,నీరు,నేల జీవావరణ వ్యవస్థల పరిరక్షణకు కృషి చేస్తానని ,కాలుష్య రహిత ,పచ్చని సుస్థిర ప్రపంచం కోసం సర్వదా పాటుపడుతామంటూ విద్యార్థులు ముక్త కంఠంతో ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయ కర్త అశ్విని చంద్రశేఖర్ మాట్లాడుతూ భూమిని కాపాడుకోకపోతే మానవాళి మనుగడకు ఇబ్బందులు కలుగు తాయని అన్నారు. విద్యుత్,నీళ్లు, కాగితాల వంటి వనరులను పొదుపుగా వాడాలని కోరారు. ప్రతి ఒక్కరు విధిగా ప్లాస్టిక్ వాడకాన్ని మానుకోవాలని సూచించారు. విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించి భూ తల్లిని కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ యం జి.వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు బాసిద్, కల్పన,ఎ. చంద్రశేఖర్ ,ఎ యన్ యం పవిత్ర,ఆశా కార్యకర్త నందిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.