భక్తులను ఆకట్టుకున్న కళాజాత ప్రదర్శనలు

జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 22: ప్రాణహిత పుష్కరాలు పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి కళాకారులు కాళేశ్వరం లో నిర్వహిస్తున్న కళాజాత ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. శుక్రవారం కాళేశ్వరముక్తీశ్వర ఆలయం దగ్గర తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు తమ ఆట పాటలతో భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు. శంకరా నాగశరిరాభర అనే పాట దుప్పటి రవి పాడగా భక్తులు పరవశించి వంతపాడారు. ఓహో జంగమా ఆదిదేవుడా అనేపాట జాడి సుమలత ఆలపించగా కొందరు భక్తులు కాలు కలిపి నృత్యం చేశారు. సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళాజాత ప్రదర్శనలో భక్తిరస పాటలు, భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సంక్షేమ కార్యక్రమాల పాటలతో సాంస్కృతిక సారథి కళాకారులు అందరిని ఆకట్టుకుంటూ, భక్తులను చైతన్యపరుస్తూ, పుష్కర విధుల్లో తమవంతు బాధ్యతను నెరవేరుస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.