భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి:: జిల్లా ప్రజా పరిషత్ సిఇఓ ఎన్. శోభారాణి

జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 20: కాళేశ్వర మహా క్షేత్రంలో ఈనెల 13 నుండి ప్రారంభమైన ప్రాణహిత పుష్కరాలలో ఇప్పటి వరకు ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు, సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని, పుష్కరాలు ముగిసే వరకు వివిధ శాఖల అధికారులు ఇదే విధంగా సేవలను అందించాలని జట్పి సిఈఓ ఎన్. శోభారాణి అన్నారు. బుధవారం కాళేశ్వర క్షేత్రంలో వివిధ శాఖల అధికారులతో పుష్కరాల చివరి రోజు వరకు చేపట్ట వలసిన చర్యలపై త్రివేణి గెస్ట్ హౌజ్ లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, పుష్కరఘాట్ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బోటింగ్ ద్వారా పహారా నిర్వహించాలని అన్నారు. వైద్యశాఖ అధికారులు కేవలం క్యాంపుల వద్ద మాత్రమే కాకుండా మొబైల్ టీంలను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణి చేయాలని సూచించారు. పుష్కరాలు తరువాత ఎక్కడా పారిశుద్ద్య సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం పాటించాలని అన్నారు. పారిశుద్ధ్య సిబ్బందిని షిప్టులవారిగా నియమించి, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆర్టిసీచే అదనంగా బస్సులను ఏర్పాటు చేయాలని అన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా పోలీసు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు.
ఈ సమావేశంలో డిఎస్పి బోనాల కిషన్, ఎంపిపి రాణిబాయి, సర్పంచ్ వసంత, యంపిటిసి మమత, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.