బైక్ ర్యాలీ జయప్రదం చేయండి యుటిఎఫ్

ప్యాపిలి ఏప్రిల్ 18 (ప్రజా నేత్ర న్యూస్); సి పి యస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో నేటి నుండి ఒక వారం రోజులు అనగా ఏప్రిల్ 18 నుండి 25 వరకు సి పి యస్ రద్దుకై పోరు గర్జన పేరుతో బైక్ జాతా నిర్వహిస్తున్నామని జాతా కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి పిలుపునిచ్చారు.బైక్ జాతా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి యుటిఎఫ్ ప్యాపిలి మండల శాఖ అధ్యక్షులు సర్వజ్ఞ మూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో నరసింహారెడ్డి మాట్లాడుతూ సి పి యస్ రద్దు చేయాలని కోరుతూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం,విజయనగరం,చిత్తూరు,అనంతపురం జిల్లాల నుండి నాలుగు జాతాలు ప్రారంభమయ్యాయని జాతా నిర్వహిస్తున్న ప్రతి చోటా వందల కొద్దీ బైక్ లతో ర్యాలీలు నిర్వహిస్తున్నామని కర్నూల్ జిల్లాకు సంబంధించిన బైక్ జాతా ఏప్రిల్ 22 వ తేదీ అనగా శుక్రవారం రోజు చాగలమర్రి మండలం నందు ప్రవేశించి ఆళ్లగడ్డ,నంద్యాల,కోవెలకుంట్ల,బనగానపల్లె,డోన్ ప్రాంతాల మీదుగా ప్యాపిలి పట్టణానికి అదే రోజు మధ్యాహ్నానికి చేరుకుంటుందని కావున ఆ సమయానికి వందలాది బైక్ లతో మండల కార్యకర్తలు,సి పి యస్ ఉపాధ్యాయులు ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలని కోరారు.మండల శాఖ గౌరవాధ్యక్షులు లక్ష్మి నాయక్ మాట్లాడుతూ సి పి యస్ రద్దు చేసేంత వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు.ఈ నెల 30 వ సి పి యస్ రద్దు చేసే విధంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కౌన్సిలర్లు చంద్ర మోహన్,అంజనప్ప,సుమన్,భాస్కర్ రెడ్డి,సహాధ్యక్షులు హుసేన్ బాషా,వేణు మాధవ,రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

? ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.