బస్టాండ్ ఆవరణలో బీజేపీ నాయకుల నిరసన

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మిస్తానని KTR హామీ ఇచ్చి నేటికీ 47 నెలలు గడుస్తున్నా హామీని నెరవేర్చకుండా దున్నపోతుమీద వర్షం పడినట్లుగా వ్యవహారిస్తున్న మంత్రిగారి తిరుపై దున్నపోతుతో బస్టాండ్ ఆవరణలో నిరసన కార్యక్రమం చేసిన మండల BJP నాయకులు.ఇల్లంతకుంట మండల ప్రజలకు మండల కేంద్రంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మిస్తానని జిల్లా మంత్రి KTR గారు తేది 16-05-2018 రోజున ఇచ్చిన హామీ 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి హామీ 47 నెలలు గడుస్తున్నా హామీని నెరవేర్చకపోవడంతో దున్నపోతుమీద వర్షం కురుస్తున్నట్లు చలనంలేని కల్వకుంట్ల తారక రామారావు గారి దున్నపోతుమీద నీళ్లు చల్లుతు ఇల్లంతకుంట బస్టాండ్ ఆవరణలో నిరసన కార్యక్రమం చేస్తూ బెంద్రం.తిరుపతిరెడ్డి మండల బీజేపీ అధ్యక్షులు మాట్లాడతూ..జిల్లా మంత్రి KTR గారు ఇచ్చిన హామీ నెరవేర్చలాని ప్రతి నెల 16 వ తేదిన 17 మసాలా నుండి పలు వినతిపత్రలు,నిరసనలు,దీక్షలు,ధర్నాలు, రాస్తారోకలు,మౌన దీక్షలు, ప్లైకార్డ్స్ తో,కరపత్రాలుపంపిణీ ,మోలుకొలుపులు ఎన్ని రకాల నిరసన కార్యక్రమాలు చేస్తుంటే దున్నపోతు మీద వర్షం కురుస్తున్నట్లు ఉందని,దున్నపోతు KTR మీద ప్రజలు నీళ్లు చల్లుతు విన్నుత కార్యక్రమం చేసారన్నారు మండల ప్రజలు,బీజేపీ నాయకులు పాలుగోన్నారు.

Leave A Reply

Your email address will not be published.