ప్రజలపై రూ.750 కోట్లు ఆర్టీసీ చార్జీలు భారం మోపిన వైసీపీ ప్రభుత్వం. తక్షణం ఉపసంహరించాలని. సిఐటియు డిమాండ్!

ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు  తక్షణం ఉపసంహరించుకోవాలని సి ఐ టి యు కడప జిల్లా కార్యదర్శి సి హెచ్ చంద్రశేఖర్  అన్నమయ్య జిల్లా, రైల్వేకోడూరులో విలేకర్ల సమావేశంలో డిమాండ్ చేశారు. రూ.750 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు ఛార్జీల  పెంచి ప్రజలపై భారం మోపిందన్నారు, పెంచిన ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా  చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆర్టీసీ చార్జీల పెంపు పేరుతో రాష్ట్ర ప్రజలపై రూ.750 కోట్లు భారం మోపి రాష్ట్ర ప్రభుత్వం దొంగ దెబ్బ తీసింది ఈ భారాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ ఏకమై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మంత్రివర్గం మారిన  సందర్భంగా నూతన కానుకగా రాష్ట్ర ప్రజలకు భారీగా బస్ చార్జీల వడ్డన చేసిందని విమర్శించారు. ఉగాదికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కరెంట్ చార్జీలు పెంచగా… కేంద్రంలోని మోడీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, గ్యాస్, తదితర వాటి ధరలు భారీ మొత్తంలో పెంచిందన్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను పెంచిందన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎడాపెడా ధరలు పెంచుతూ ప్రజలపై భారా లపై భారాలు మోపుతూ నడ్డి విరుస్తున్నాయి అని ఆందోళన వ్యక్తం చేశారు. మరో వైపున రాష్ట్రప్రభుత్వం చెత్త పన్ను ఆస్తిపన్ను నిత్యావసర సరుకుల ధరలు పెంచిందన్నారు. కరోనా నేపథ్యంలో  పనులు కోల్పోయి వేతనాలు కోల్పోయి ఆదాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. డీజిల్ ధరలు పెంచిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం పోరాడాల్సింది పోయి ఆ భారాన్నిఆర్టీసీ చార్జీల రూపంలో ప్రజలపై మోపడం దారుణమన్నారు. 50 యూనిట్ల లోపు వాడే వారిని సైతం వదిలిపెట్టకుండా విద్యుత్ ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  మాట తప్పారని విమర్శించారు. ఆర్టీసీ చార్జీలు సామాన్య పేద మధ్యతరగతి ప్రజలు వినియోగించే పల్లెవెలుగు బస్సు చార్జీలను ఐదు నుంచి పది రూపాయల వరకు పెంచిందని అలాగే హైదరాబాద్ రూట్ తిరిగే సర్వీసులకు 75 రూపాయల వరకు ఛార్జీలను ప్రభుత్వం పెంచిందని విమర్శించారు
టోల్ ప్లాజా సెస్ , డీజిల్ సెస్ పేరుతో చార్జీలు పెంచడం దారుణమన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో స్వాధీనం చేసుకున్నది చార్జీలు పెంచడానికి అని ప్రశ్నించారు. ఛార్జీలు భారాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఛార్జీలు తగ్గించేందుకు వరకు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని దీనిలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాలు పోటీలు పడుతూ భారా లపైభారాలు మోపుతున్నాయి అని అన్నారు. పట్టణ సంస్కరణల్లో భాగంగా విజయవాడ నగర ప్రజలపై ఆస్తి పన్ను రూపంలో రూ.1200 కోట్లు, చెత్త పన్ను రూపంలోరు.350 కోట్లు, విద్యుత్ ఛార్జీల రూపంలో రాష్ట్ర ప్రజలపై రూ.4,300 కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారాలు మోపాయని , ఇలా వివిధ రూపాల్లో వేల కోట్ల రూపాయల భారాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోపాయని అన్నారు. ఇటువంటి భారాలకు వ్యతిరేకంగా ప్రజలు సంఘటితంగా ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో   సిపిఎం రైల్వే కోడూర్ నాయకులు లింగాల యానాదయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, సిగి చెన్నయ్య, సి ఐ టి యు మండల కన్వీనర్ దాసరి జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.