దళిత బందు తో సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన మారుమూల తిరుపతికి శుభాకాంక్షలు తెలిపిన తుమ్మేటి సమ్మిరెడ్డి

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని కాలేజీ రోడ్ లో దళిత బందు లబ్ధిదారు మారుముళ్ల తిరుపతి సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, వార్డ్ కౌన్సిలర్ దిడ్డి రాము. తుమ్మేటి సమ్మిరెడ్డి మాట్లాడుతూ… దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే దళితులకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయంతో పాటు ఉపాధి అవకాశం కల్పిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రికె చంద్రశేఖర్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పథకం ద్వారా నిరుపేదలైన వారు స్వతహాగా సూపర్ మార్కెట్లో ఏర్పాటు చేసుకొని నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారని, ఇలాంటి పథకం ఏ ప్రభుత్వం తీసుకోరాదని ఒక తెలంగాణ ప్రభుత్వానికి సాధ్యమవుతుందని అన్నారు. దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందిన మారుమూల తిరుపతికి తుమ్మేటి సమ్మిరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. లబ్ధిదారు తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు.  ప్రజా నేత్ర ప్రతినిధి దొడ్డే రాజేంద్ర ప్రసాద్

Leave A Reply

Your email address will not be published.