జెడ్పిటిసి కార్యాలయం లో డాక్టర్ శ్రీ రామ్ శ్యామ్ ZPTC ప్రెస్ మీట్

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం పత్రిక మిత్రులకు నమస్కారం ఈరోజు జెడ్పిటిసి కార్యాలయం లో పత్రికా విలేకరుల సమావేశంలో డాక్టర్ శ్రీ రామ్ శ్యామ్ ZPTC మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి 27 ఏప్రిల్ 2001 సంవత్సరంలో లో కెసిఆర్ నాయకత్వంలో ఆనాడు జలదృశ్యం లో టిఆర్ఎస్ పార్టీ స్థాపించడం జరిగింది.నీళ్లు నిధులు నియామకాలు అనే నాదంతో పార్టీ ఏర్పడిందని గుర్తు చేశారు. ఆంధ్ర వలస వాదులు పెత్తందారులు తెలంగాణ ప్రాంతాన్ని ఆర్థికంగా, రాజకీయంగా ,సామాజికంగా ఎంతో దోపిడీకి గురవుతున్నది కెసిఆర్ భావించడం జరిగిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిన అనంతరం ఎన్నో ఒడిదుడుకులు తరువాత ఎన్నో పోరాటాల అనంతరం తెలంగాణ రాష్ట్రాన్ని నూతన రాష్ట్రం గాఏర్పడడానికి కారకులు కెసిఆర్ ని కొనియాడారు. తెలంగాణ సమాజాన్ని మొత్తం తెలంగాణ ఉద్యమంలో తీసుకొచ్చిన ఘనత కెసిఆర్ కు దక్కుతుందని కొనియాడారు.రేపు జమ్మికుంట మండలంలోని వివిధ గ్రామాలలో ఆయా గ్రామ కూడలి వద్ద టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలని గ్రామ పార్టీ అధ్యక్షులకు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రజాప్రతినిధులకు జెడ్పిటిసి సూచించారు.ప్రజా నేత్ర ప్రతినిధి దొడ్డే రాజేంద్ర ప్రసాద్

Leave A Reply

Your email address will not be published.