ఘనంగా పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్ద లింగాపూర్ లో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమం పూర్తిగా పాఠశాలలో తొమ్మిదవ తరగతి పూర్తి చేసుకొని పదవ తరగతిలో చేరబోతున్న విద్యార్థులు నిర్వహించడం జరిగింది సభాధ్యక్షులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు Ch వెంకటేశ్వరరావు తొలిపలుకులు (స్వాగతోపన్యాసం) తో సమావేశం ప్రారంభమైనది ముఖ్యఅతిథిగా ( గ్రామ సర్పంచ్ ) గొడిశెల జితేందర్ గౌడ్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉత్తమ ఫలితాలు మరియు 10 జిపిఎ లతో పాఠశాలకు, గ్రామానికి, తల్లిదండ్రులకు పేరు తేవాలని కోరారు. అలాగే కష్టపడి చదివి ఉన్నత స్థానాలలో నిలవాలని కోరారు . ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ రాజ్ మహమ్మద్ ఉప సర్పంచ్ కుమార్ యాదవ్ పాఠశాల కమిటీ వైస్ చైర్మన్ శ్రీమతి కేతిరెడ్డి రజిత సభ్యులు ఎల్లవేణి రమేష్ వార్డు సభ్యులు సురేందర్ ఉపాధ్యాయులు కనకయ్య, వీరస్వామి ,యాదగిరి, పుష్పలత, బ్రహ్మం ,రవీందర్ నాయక్ ,శ్రీనివాస్, సునీత ,పద్మలత, సమత మరియు సిబ్బంది చొక్కయ్య ,నారాయణ పాల్గొన్నారు అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఈ సమావేశానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి తర్వాత పాఠశాలలో 6 నుండి 9 వ తరగతి వరకు చదివి పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన విద్యార్థులకు గ్రామ సర్పంచ్ మరియు అతిధుల సమక్షంలో ప్రగతి పత్రాలు అందజేయడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.