కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి – కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బొంపల్లి దేవేందర్ రావు

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బొంపల్లి దేవేందర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం లోని రావూరు , సీత్యా తండా తదితర గ్రామాల్లో వరి కోతలు కోసిన రైతులను కలిసి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం వారం రోజులు దాటినా ఎక్కడ ఏర్పాటు చేయకపోవడం సిగ్గు చేటన్నారు. రైతులు కోసిన వరి ధాన్యాన్ని రోడ్ల వెంట ఆరబెట్టి ఇబ్బందులు పడుతున్నారన్నారు. అంతేకాకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు గేటు వ్యాపారస్తులకు విక్రయించడంతో భారీగా నష్టపోతున్నారని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కందికట్ల అనిల్, యూత్ కాంగ్రెస్ వర్ధన్నపేట నియోజకవర్గ అధ్యక్షులు కొమ్ము రమేష్ యూత్ కాంగ్రెస్ నాయకులు జిల్లా నవీన్ పిట్టల లోకేష్ , రాజేష్ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.