కేటీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన భాజపా నాయకులు

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో కాగజ్ నగర్ పట్టణంలో : నిన్న వరంగల్ లోబహిరంగా సభలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు కాగజ్ నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద కేటీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. టౌన్ భాజపా అధ్యక్షులు గోలెం వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం లో భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ, భాజపా నాయకులు డా పాల్వాయి హరీష్ బాబు, టౌన్ అధ్యక్షులు గోలెం వెంకటేష్, కిసాన్ మోర్చ జనరల్ సెక్రటరీ ముత్తు అశోక్, బిజేవైఎం ప్రధాన కార్యదర్శి మెడి కార్తిక్, డోంగ్రి అరుణ్, ఉమ్మెర బాలకృష్ణ, సంతోష్ ఠాకూర్, రాజేందర్ జాంజోడ్, చేరాల శ్రీనివాస్, చిప్ప రమేష్, మందడే సుధాకర్, దుర్గం ప్రశాంత్, గుమ్ముల సాయికృష్ణ, జాడి దీపక్, ప్రశాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.