ఎక్సైజ్ అధికారుల దాడులు ఇద్దరిపై కేసు నమోదు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో కాగజ్ నగర్ పట్టణంలో ఎక్సైజ్ అధికారుల దాడులు ఇద్దరిపై కేసు నమోదు:కాగజనగర్ పట్టణంలో దేసీదారు విక్రయిస్తున్నారని పక్కా సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించగా నవేగం బస్తి చెందిన పైడి సారయ్య,ఇంటి వద్ద నిల్వ ఉంచిన 16 (90)ml మరియు తిలక్ నగర్ చెందిన ఎనం రాజు, ఇంటి వద్ద నిల్వ ఉంచిన 550(90)ml దేసీదారు సీసాలను స్వాధీనపరచుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ మహేంద్ర సింగ్ గారు తెలిపారు.ఈ దాడుల్లో ఆబ్కారీ ఎస్. ఐ. కిషన్, మరియు డి. టి. ఎఫ్. ఎస్.ఐ. విలాస్ కుమార్, కానిస్టేబుల్ తనజీ,వెంకటేష్, సతీష్,నవీన్,కుమార్ పాల్గొన్నారు.