ఇష్టపడి శ్రమిస్తే గమ్యాన్ని చేరతాం. జిల్లా అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు

జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 22;  నిరుద్యోగ యువత ఇష్టపడి చదివితే గమ్యాన్ని ఖచ్చితంగా చేరవచ్చని, శ్రమిస్తెనే ఫలితం ఉంటుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ శ్రీ వి. శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్, మరియు పోలీస్ శాఖ సహకారంతో నిరుద్యోగ యువతకు పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించిన ఫ్రీ కోచింగ్ సెలెక్షన్, (స్క్రీనింగ్ టెస్ట్) నిర్వహించారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్ లో ఎంపికయిన అభ్యర్థులకు 2 నెలలపాటు ఉచిత వసతి, దేహదారుడ్య సామర్ధ్య శిక్షణతో పాటు వివిధ సబ్జెక్టులకు క్లాసులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పి వి శ్రీనివాసులు గారు మాట్లాడుతూ నిరుద్యోగ యువత పోలీసులతో పాటు, అన్నీ పోటీ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. పోలీసు నియామకాలకు సంబంధించిన ఉచిత శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని, ఉద్యోగ అవకాశo పొందాలన్నారు. జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ ఆధికారిని సునీత మాట్లాడుతూ నిరుద్యోగులు సమయం వృధా చేసుకోవద్దని, సమయం చాలా విలువైనది ప్రణాళిక ప్రకారం చదువుకుని ఉద్యోగం సాధించాలన్నారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్ లో 54 మంది అభ్యర్థులు ఎంపిక ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి సీఐ రాజిరెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు యాదిరెడ్డి, మధుకర్, శ్రావణ్, చరణ్, వీరన్న, రమేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.