ఆజాద్ కా అమృత్ మహోత్సవం పై ఆరోగ్య సిబ్బంది తో సమీక్షా సమావేశం ; డాక్టర్ ఇంతియాజ్ ఖాన్

ప్యాపిలి ఏప్రిల్ 18 (ప్రజా నేత్ర న్యూస్) :ప్యాపిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఇంతియాజ్ ఖాన్ 21.04.2022 వ తేదీన జరిగే ఆజాద్ కా అమృత్ మహోత్సవం ఆరోగ్య మేళా గురించి ఆరోగ్య సిబ్బంది తో సమీక్షా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఆరోగ్య మేళాకు మన ప్యాపిలి మండల గ్రామా సచివాలయల నుంచి ప్రజలు విరివిగా వచ్చి వారి ఆరోగ్య సమస్యలు తెలిపి పరీక్షలు చేయించుకోవలనరు. ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. డాక్టర్ నితీష్, ఎల్. రాఘవేంద్ర గౌడ్ మాట్లాడుతూ ఆరోగ్య మేళాలో అందించే సేవలు మాత శిశు సంరక్షణ సేవలు, క్యాన్సర్, ఈ ఎన్ టి, గుండె సంబంధిత, ఎన్ సీ డీ, దంత,కంటి, స్పెషలిస్ట్ చే పరీక్షలు నిర్వహించి వారికీ కావలసిన మందులు అందజేస్తారు. ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు ప్రజలకు అవగాహన కల్పించి ఆరోగ్య మేళాకు పంపవలేను వివరించారు. ఈ కార్యక్రమం లో పర్యవేక్షకులు జగదంబిక, ఆరోగ్య కార్య కర్త లు పాల్గొన్నారు.

? ప్రజానేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.