కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు; జడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణశర్మ

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన వసతులు ప్రభుత్వం కల్పిస్తున్నట్లు జిల్లా జడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణశర్మ అన్నారు రాష్ట్రవ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామంలో ఉన్నంత ప్రాథమిక పాఠశాలలను పరిశీలించిన ఆమె ఈ సందర్భంగా జిల్లా జడ్పీ చైర్మన్ మాట్లాడారు సిద్దిపేట జిల్లాలో మన ఊరు మనబడి కార్యక్రమం కింద 343 ప్రభుత్వం పాఠశాలలను మొదటి విడతలో ఎంపిక చేసిఅభివృద్ధి పై దృష్టి సారించినట్లు తెలిపారు విద్యార్థులందరూ ప్రైవేట్ పాఠశాల వెళ్లకుండా తప్పకుండా ప్రభుత్వ పాఠశాల కు రావాలని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య తో పాటు భోజనవసతి ప్రభుత్వం కల్పిస్తున్నట్లు తెలిపారు విద్యార్థులందరికీ ప్రభుత్వ పాఠశాలలో విశాలమైన తరగతి గదులు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యార్థులకు విద్యాబుద్ధులు ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు తెలిపారు మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఆమె విద్యార్థులకు భోజనం వడ్డించారు రాబోయే రోజుల్లో రెండో విడత లో సిద్దిపేట జిల్లాలోని పాఠశాలను అభివృద్ధి పై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకం ప్రవేశ పెట్టిన భారతదేశానికి ఆదర్శవంతంగా ఉంటాయని ఆమె అన్నారు ప్రాథమిక పాఠశాల లోని లైబ్రరీ పరిశీలించి లైబ్రరీలో ఉన్న పుస్తకాలను విద్యార్థులు చదువు కోవాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో ఏ ఈ బ్రహ్మం సర్పంచ్ చంద్రకళ రవి గౌడ్ ఎంపిటిసి దుర్గారెడ్డి మాజీ ఎంపిటిసి చంద్రమౌళి గౌడ్ పంచాయతీ కార్యదర్శి మల్లేశం ఉపాధ్యాయులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు…. ప్రజానేత్ర న్యూస్ ఛానల్ రిపోర్టర్ చిన్నకోడూరు మండలం.

 

Leave A Reply

Your email address will not be published.