వైసీపీ నాయకుల చేతిలో గాయపడిన డీవైఎఫ్ఐ నాయకులను పరామర్శించిన తెలుగుదేశం పార్టీ నాయకులు

ప్రజా నేత్ర న్యూస్ 22 ; గంగినేని గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ మరియు వైసీపీ నాయకుల చేతిలో గాయపడి మైలవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీవైఎఫ్ఐ నాయకులను పరామర్శించిన విజయవాడ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వాసం మునియ్య, పార్లమెంట్ అధికార ప్రతినిధి దొండపాటి రాము మరియు ఎస్సీ సెల్ కార్యదర్శి వనపర్ల డేవిడ్ రాజు మరియు దూరు బాలకృష్ణ కలిసి పరామర్శించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 28 నెలల కాల వ్యవధిలో దళితుల పై దాడులు విపరీతంగా పెరిగాయి. దళితులపై దాడి చేసిన వైసీపీ నాయకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయలేని ఈ పోలీస్ వ్యవస్థ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద మాత్రం ఈ చట్టం కింద కేసు నమోదు చేయడానికి చాలా అత్యుత్సాహంతో ఉన్నారు. విధ్యార్ది సంఘాల నాయకులను కొట్టాల్సిన అవసరం ఈ వైసీపీ నాయకులకు ఏం పని అని ప్రశ్నించారు. డీవైఎఫ్ఐ నాయకులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

Leave A Reply

Your email address will not be published.