ఈ సారి మీ మంత్రి ఎక్కడ నుండి పోటి చేస్తారో అది చెప్పండి ? – మండల పార్టీ కన్వీనర్ వెన్నా వెంకటరెడ్డి

యర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి ఎరిక్షన్’బాబునే

వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంపై ఎన్ని అబద్ధాలు ఆడాతారు

చేసిన అభివృద్ధి చప్పలేక ఉలిక్కి పడతారెందుకు

పెద్దారవీడు -గుమ్మడి కాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకొన్నట్లుగా, చేసిన అభివృద్ధి చెప్పలేకనే తమ పార్టీ నియోజకవర్గం ఇన్’ఛార్జి గూడూరి ఎరిక్సన్’బాబు మీద విమర్శలు చేయడం మంచి పధ్ధతి కాదని టిడిపి మండల కన్వీనర్ వెన్నా వెంకటరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సూచించారు. వచ్చే ఎన్నికలలో యర్రగొండపాలెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుడూరి ఎరిక్షన్’బాబునే పోటీ చేస్తారని అందులో ఎలాంటి సందేహం లేదని, ముందు మీ మంత్రి ఈ సారి ఎక్కడ నుండి పోటీ చేస్తారో అది చెప్పాలని మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ వెన్నా వెంకటరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై విరుచుకుపడ్డారు. ఈ మూడు సంవత్సరాల కాలంలో రాష్ట్ర మంత్రి స్థాయిలో నియోజకవర్గం ఏ మేరకు అభివృద్ధి చెందినదో గ్రామాలలోకి వెళితే ప్రజలు చెబుతారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ గుమ్మా గంగరాజు మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంపై చెప్పిన మాటలు చెప్పకుండా మాట్లాడుతున్నారని, అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి నీళ్ళు ఇస్తామని చెప్పిన వాగ్దానం ఏమైందో విలేఖరుల సమావేశాలలో ఎందుకు చెప్పటం లేదని ప్రశ్నించారు. మాజీ మండల పార్టీ అధ్యక్షులు దొడ్డా భాస్కరరెడ్డి, టడిపి జిల్లా యస్.సి.సెల్ అధ్యక్షులు మాజీ సర్పంచి లింగాల అబ్రహాంలు మాట్లాడుతూ ఒకసారి పోటి చేస్తే అక్కడ వ్యతిరేకత కూడగట్టుకొంటున్న మీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ సారి ఏ నియోజకవర్గం నుండి పోటి చేస్తున్నట్లోనని ఎద్దేవా చేశారు. గూడూరి ఎరిక్షన్’బాబు యర్రగొండపాలెం నియోజకవర్గం నుండి పోటి చేస్తారని అది ముందే మా నాయకుడు చంద్రబాబు మాకు చెప్పారని, మరి మీ నాయకుడు ఒకసారి పోటి చేసిన స్థానం నుండి మరల పోటీ చేయరెందుకని ప్రశ్నించారు. మండల యువజన నాయకులు నందిరెడ్డి చంద్ర శేఖర్’రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్సుతుందని వెలుగొండ ప్రాజెక్ట్ ముంపు గ్రామాలలో సమస్యలు వర్ణనాతీతమని ముంపు గ్రామస్తులకు రావాల్సిన నష్ట పరిహార రాయితీలు ఇప్పించాలని, తెలుగుదేశం పార్టీ హయంలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ మూడు సంవత్సరాల కాలంలో మీరు చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా అని అన్నారు. ఇక నుండి మా నాయకుడు గుడూరి ఎరిక్షన్బాబు పై ఏమైనా మాట్లాడితే మీ అంతు చూస్తామని అభివృద్ధి గురించి నిజంగా మాట్లాడాలి అని అనుకుంటే బహిరంగ చర్చకు మేము సిద్ధం అని, మీరు సిద్ధమేనా అని, మండల తెలుగుదేశం పార్టీ ఎంపిటిసి యేర్వ పాపిరెడ్డి, దుగ్గెంపూడి మల్లారెడ్డి, వెన్నా బోడిరెడ్ఢి, బీరెడ్డి శ్రీనివాసరెడ్డి, రైతు సంఘం నాయకులు గుంటక యోగిరెడ్డి, యూత్ నాయకులు తోకల యల్లయ్య సానికవరం గ్రామ కమిటీ అధ్యక్షులు బి.వెంకట నారాయణ, తోకపల్లె గ్రామ కమిటీ అధ్యక్షులు మేకల వెంకట నారాయణ, ఉప్పలపాటి శేషులు సవాలు విసిరారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.