ఇచ్చోడ వివేకానంద కళాశాల ఆవరణంలో వ్యాక్సినేషన్ డ్రైవ్

ప్రజానేత్ర న్యూస్,ఆదిలాబాద్, తేదీ:20-01-2022; ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని వివేకానంద కళాశాల ఆవరణంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద విద్యాసంస్థల ప్రిన్సిపల్ నిఖిని వర్మ మాట్లాడుతూకరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తున్న వేళ, బడుల మూతతో చతికిల బడ్డ చదువులను గట్టెకించడానికి వాక్సినేషన్ ఒకటే మార్గమని అన్నారు.వ్యాక్సిన్ తీసుకోని విద్యార్థులకు వాక్సిన్ ఇప్పించి,కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయడం జరిగింది.ప్రజల చెంతకు వాక్సినేషన్ ని చేరుస్తున్న వైద్యసిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని, మాస్క్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీ హెచ్ సీ ANM కరుణ,ఆశ వర్కర్ గంగమణి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.