ఆహార భద్రత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి.

జయశంకర్ భూపాలపల్లి జనవరి 20;  ఆహార భద్రత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఆహార భద్రత కమిటీ చైర్మన్ టి. తిరుమల్ రెడ్డి తెలిపారు. గురువారం భూపాలపల్లి పట్టణంలోని ఇల్లందు గెస్ట్ హౌస్ సమావేశ మందిరంలో ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలు, సివిల్ సప్లై, డిఆర్డిఎ, డిఈఓ, dm&ho, సిపిఓ, డిడబ్ల్యూఓ, ఐసిడిఎస్, ఎంపీడీవో లతో నిర్వహించిన సమావేశంలో కమిటీ చైర్మన్ టి. తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఆహార భద్రత అమలు తీరును పరిశీలించినట్లు తెలిపారు. పౌష్టిక ఆహారం లోపం వల్ల పిల్లల యొక్క ఎదుగుదల పరిపుష్టి కరంగా లేనందువల్ల మానవాళి మనుగడ కోల్పోయే పరిస్థితులలో మానవ సంపదను కాపాడుకునేందుకు కమిటీ ఏర్పడినట్లు చైర్మన్ తెలిపారు. జిల్లాలో చౌక దుకాణాల నిర్వహణ, అంగన్వాడి సెంటర్ల ద్వారా జరుగుతున్న పౌష్టికాహార పంపిణీ, పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు ,ప్రభుత్వ ఆసుపత్రులలో జరుగుతున్న ప్రసవాలు గర్భిణీలకు అందజేస్తున్న కెసిఆర్ కిట్ ల గురించి శాఖల వారీగా కమిటీ చైర్మన్ అడిగి తెలుసుకున్నారు. ఆహార భద్రత చట్టం పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, చట్టం హక్కుల పట్ల ప్రజలకు తెలియజేయాలని దీనికొరకు అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చైర్మన్ తెలియజేశారు. నూతనంగా ఏర్పాటు అయిన గ్రామ పంచాయతీలలో అవసరం మేరకు త్వరలో చౌకదుకాణాలు ఏర్పాట్ల కొరకు అధికారులు చర్యలు తీసుకోవాలని చైర్మన్ కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ ఆహార భద్రత చట్టం అమలుపై తగు చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ప్రజాప్రతినిధుల సహకారంతో వ్యాక్సినేషన్ 100% పూర్తి చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అన్ని పంచాయతీలలో విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేసి ఆహార భద్రత చట్టం అమలు సక్రమంగా జరిగేలా ఇస్తానన్నారు, చౌక దుకాణాలు ప్రజలకు చేరువలో ఉండేలా తగు చర్యలు తీసుకుంటానని చైర్మన్కు తెలిపారు. అన్ని పాఠశాలల్లోని కిచెన్ షెడ్, అంగన్వాడీ సెంటర్ల మరమ్మతులు త్వరలో చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే గర్భిణీ స్త్రీలకు వారి అసిస్టెంట్లకు భోజన సౌకర్యం కల్పిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. అంగన్వాడీ సెంటర్లలో ఉన్న పిల్లలను ప్రతివారం పిల్లల యొక్క బరువును పరిశీలించి తగు పౌష్టికాహారం అందజేస్తామన్నారు. త్వరలో న్యూట్రిషన్ హ్యాబిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసి బలహీనంగా ఉన్న పిల్లలకు న్యూట్రిషన్ ఆహారం అందించి ఆరోగ్యవంతులుగా తయారుచేస్తామని అన్నారు. ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు తెలియజేసిన సమస్యలను త్వరలో పూర్తి చేస్తానని కలెక్టర్ తెలియజేశారు. అనంతరం ఆహార భద్రత చట్టం అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించుటకు రెండు రోజుల పర్యటనకు వచ్చిన చైర్మన్ ను కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ స్వర్ణలత, డిఆర్డిఏ పురుషోత్తం, డీఎస్ఓ గౌరీశంకర్, జడ్పీ సీఈఓ శోభారాణి, డిపిఓ ఆశాలత, జిల్లా సంక్షేమ అధికారి శామ్యూల్, ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, ఎంపీడీవోలు సంబంధిత జిల్లా అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.