అక్రమ హౌస్ అరెస్టులను ఖండించండి–PRC లో ఉద్యోగులకు జరిగిన నష్టాన్ని సరిచేయండి! సీఐటీయూ డిమాండ్

ప్రజా నేత్ర న్యూస్ 20-1-22 ; మెరుగైన PRC సాధనకోసం ఉద్యోగులకు PRC లో జరిగిన నష్టాలను సరిచేయాలని,రాష్ట్రo లోని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు 20-01-2022న తలపెట్టిన చలో కలెక్టరేట్ కు మద్దతు తెలియచేసి,తమ నిరసనను తెలియచేయడమే నేరమన్నట్లు అర్ధరాత్రి ఇంటిల్లిపాది భయబ్రాంతులకు గురయ్యేలా హౌస్ అరెస్టులు చేయడం సరైందికాదు  అని సి ఐ టి యు కడప జిల్లా కార్యదర్శి సిహెచ్. చంద్రశేఖర్ తీవ్రంగా ఖండించారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి  ఉద్యోగులు ఉపాధ్యాయులు పైకి పోలీసుల పంపలేదని,  నిర్బంధ ఉద్యమం ఆపలేరన్నారు.ప్రభుత్వం చేయాల్సింది అరెస్టులు కాదు,పిఆర్సీ లో జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని, డిమాండ్ చేశారు20%ఇస్తున్న HRA ని 8%కు, CCA ను పూర్తిగా తొలగించడం .8ఇప్పుడిస్తున్న IR 27%కన్నా ఫిట్మెంట్ తగ్గించి 23%ఇవ్వడం,పెన్షనర్లకు 70ఏళ్ళు దాటిన తర్వాత పెంచి ఇచ్చే  పెన్షన్ ను 80ఏళ్లకు  పెంచడం,ప్రస్తుత మున్న PRC కాలపరిమితి 5సం”నుండి 10సం”పెంచడం*CPS రద్దు చేసి పాత పెన్షన్ ఇవ్వాలని కోరడం ఇటువంటి నిర్ణయాలు PRC చరిత్రలోనే జరగలేదు.ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా అలోచించి PRC లో జరిగిన నష్టాన్ని సరిచేయాలని,అక్రమ హౌస్ అరెస్టులను ఆపాలని , తప్పుడు కేసుల వల్ల ఉద్యమం ఆపలేరన్నారు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు  ఆందోళనలు  ముట్టడిలో పాల్గొని జయప్రదం  చేశారని ఇప్పుడైనా ప్రభుత్వ ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం మాట తప్పకుండా పీఆర్ సి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. వారి న్యాయమైన కోరికలకు సిఐటియు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఇట్లు,
సిహెచ్.చంద్రశేఖర్.
సిఐటియు కడప జిల్లా కార్యదర్శి

Leave A Reply

Your email address will not be published.