MRO గారికి వినతి పత్రం అందజేసిన ఎస్ ఎఫ్ ఐ మండల కార్యదర్శి కడవలరవికుమార్

మద్దికెర మండల పరిధిలోగల కె.వి.ఆర్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ బాలికల స్కూల్ కు ఆనుకొని ఎటువంటి షాపింగ్ కాంప్లెక్సులు కట్టకూడదని, అలాగే స్కూల్ ఉన్న సమయంలో ఆటోలు స్కూల్ కి ఎదురుగా ఉండ కుండ ఉండేలా చూడాలి అని, స్కూల్ ముందు ఉన్న ప్రదేశంలో రాత్రి సమయంలో మూత్ర విసర్జన చేస్తున్నారని ఆ ప్రదేశాన్ని నీట్ గా ఉండడం కోసం ఆ ప్రదేశంలో చెట్లు నాటేందుకు కు అనుమతి ఇవ్వాలని MRO సార్ గారిని ఎస్ ఎఫ్ ఐ మండల కార్యదర్శి కడవలరవికుమార్ కోరారు. అదేవిధంగా కె.వి.ఆర్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ బాయ్స్ హై స్కూల్ ముందు ఉన్న ఎరువు గుంతలను పూడ్చి పరిశుభ్రంగా ఉంచాలని మద్దికెర తాసిల్దార్ గారికి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షుడు రామంజి, సహాయ కార్యదర్శి భరత్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా నేత్ర రిపోర్టర్ వీరేశ్

 

Leave A Reply

Your email address will not be published.