120 మందికి ఉచితంగా కళ్ళ అద్దాల పంపిణీ

మద్దికేర మండలం పెరవలి గ్రామమము నందు స్థానిక రంగనాథ స్వామి దేవాలయ అవరణములో “పెరవలి గ్రామ సేవా సమితి” ఆధ్వర్యంలో గ్రామపెద్దల ఆర్థిక సహకారంతో శాంతిరామ్ హాస్పిటల్ కంటి వైద్య నిపుణులచే ఉచితంగా కంటి వైద్యపరీక్షలు పేద ప్రజలకు చూడటం జరిగింది. ఈ పరీక్షలలో దాదాపు 120 మందికి కంటి చూపు మాధ్యమంగా ఉండటంతో వారందరికీ ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది.అలాగే చూపు పూర్తిగా ఇబ్బంది ఉన్నవారికి 36 మందికి ఉచితంగా శాంతిరాం హాస్పిటల్ మంచి నైపుణ్యం ఉన్న కంటి వైద్యులతో ఆపరేషన్ చేయించడం జరిగింది.ఈ కార్యక్రమములో పెరవలి గ్రామ సేవా సమితి అధ్యక్షులు అనిల్ కుమార్ గౌడ్,ఉపాధ్యక్షులు నాగరాజు,కార్యదర్శి రాజేష్,కోశాధికారి రాజు,సభ్యులు రాకేష్,వెంకటేష్,రమాకాంత్,నాగరాజు,ప్రదీప్,సతీష్,రాజు,రాంప్రసాద్,బాలు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.