స్టెప్ సీఇఓ..తెళ్ళరవికుమార్. కు ప్రతిభావంతుడు జాతీయ పురస్కారం

ఒంగోలు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ మరియు స్టెప్ సీఈవో రవి కుమార్ కు ప్రతిభావంతుడు జాతీయ పురస్కారం అందజేశారు శనివారం రాత్రి ఒంగోలులో జరిగిన సకల ఆర్ట్స్ కల్చరల్ అకాడమీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతుల పురస్కారం వేడుకల్లో ఆయన ఘనంగా సన్మానించి అవార్డును అందజేశారు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గా మహిళల అభివృద్ధికి స్వయం సహాయక గ్రూపులు బలోపేతం కావడం తద్వారా వారిలో జీవన నైపుణ్యాలు పెంచే విధంగా తర్ఫీదు ఇవ్వటంలో ఆయన చేసిన కృషి ప్రశంసనీయమని చెప్పవచ్చు పట్టణాల్లో మహిళా గ్రూపు సంఘాలు అధిక సంఖ్యలో రుణాలు తీసుకుంటూ స్వయం శక్తి పై ఆధారపడటలోతెళ్ళరవికుమార్ ప్రత్యేక శ్రద్ధ చూపించారు మహిళల పురోభివృద్ధి సాధనకు వారిలో వృత్తి శిక్షణ నైపుణ్యాలు ఇవ్వటం తద్వారా భవిష్యత్తులో వారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కుటుంబ పోషణ చేసుకోవటం ఇలాంటి విధానాలకు ప్రత్యేక కృషి చేస్తున్నారు జిల్లా ప్రత్యేక స్పెషల్ కలెక్టర్ పి గ్లోరియా మాతా శిశు వైద్యశాల సూపర్డెంట్ సూరి నేని ఉష చేతుల మీదుగా ఘనంగా సన్మానించి శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు ఈ కార్యక్రమంలో లిటిల్ చాంప్స్ అకాడమీ సెక్రెటరీ బు చే శ్వరారావు డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ బి నాగరాజు సంస్థ కార్యదర్శి నజీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.