శ్రీ పంచ ముఖ ఆంజనేయ స్వామి దేవాలయ భూమి పూజ మహోత్సవం

ఖమ్మం జిల్లా : ముదిగొండ మండలం , లక్ష్మీపురం గ్రామం సమీపంలో శ్రీ ప్లవ నామ సం||ర మార్గశిర శుద్ధ సప్తమి శుక్రవారం శతభిషా నక్షత్రయుక్త కుంభ లగ్నం ఉదయం 11 గంటల 05 ని॥ల సుముహూర్తమునకు శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం శంకుస్థాపన కార్యక్రమం ( భూమి పూజా మహోత్సవం ) ను అంగరంగ వైభవంగా నిర్వహించామని నూతన దేవాలయం నిర్వాహకులు శ్రీ పెరంబుదూరు రాజాచార్యులు , లక్ష్మణాచార్యలు , కమలాకరా చార్యులు , పెద్దపాక రమేష్ , వేముల సత్యవతి , బ్రహ్మ శ్రీ కొదమ సింహం భరద్వాజ్ , వేదపండితులు కొండవీటి సుబ్రహ్మణ్య శర్మ , మణికంఠ శర్మ లు తెలియజేశారు . తదనంతరం వారు మాట్లాడుతూ గణపతి పూజా , పుణ్యాహవాచనం , ఋత్విగ్ వరుణ , వాస్తు పూజా , వాస్తు హోమం , గర్తన్యాసం ఆ తర్వాత వచ్చిన భక్తులతో నవదాన్యాలు సమర్పించి , కొబ్బరికాయలు కొట్టి స్వామి వారి భూమి పూజా కార్యక్రమాన్ని ప్రారంభించిన మని పేర్కొన్నారు.ప్రజానేత్ర న్యూస్ చానల్ ముదిగొండ.

Leave A Reply

Your email address will not be published.